
హిట్..ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్న తమిళ్ హీరో విశాల్ ప్రస్తుతం ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రమణ్యం డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఈ చిత్రానికి తెలుగు లో చక్ర అనే టైటిల్ ఫిక్స్ చేసారు. దీనికి సంబందించిన ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో రెజీనా కాసాండ్ర నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈమె పాత్ర సినిమాకు కీలకం కానుందని అంటున్నారు. లేడీ విలన్‌గా రెజీనా కనిపించనుందని టాక్. ఇటీవల ‘ఎవరు’ సినిమాలో రెజీనా నెగిటివ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటనకు గాను రెజీనా విమర్శకుల ప్రశంసలు అందకున్నారు. ఇప్పుడు ‘చక్ర’ సినిమాలో కూడా రెజీనా పాత్ర అదిరిపోతుందట. అయితే, ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎవరో తెలియాల్సి ఉంది.
ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నిర్మిస్తున్నారు. ఎం.ఎస్.ఆనందన్ దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మిస్తున్నారు. బ్యాంక్ రాబరీ, హ్యాకింగ్, సైబర్ క్రైమ్ నేపథ్యంలో అత్యుత్తమ సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.









