వర్మ ‘పవర్ స్టార్ ‘ చూసారా..?

వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా సంచలన టైటిల్ ప్రకటించి వార్తల్లో నిలిచాడు. లాక్ డౌన్ సమయంలోనే రెండు శృంగారభరిత చిత్రాలు ప్రకటించి ఆశ్చ్ర్య పరిచగా..తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయోపిక్ తెరకెక్కిస్తున్నట్లు తెలిపి షాక్ ఇచ్చాడు.

తాజాగా ట్విట్టర్ ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు. ‘‘బ్రేకింగ్‌ న్యూస్‌: ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌ కొత్త సినిమాకు ‘పవర్‌ స్టార్‌’ అనే పేరు పెట్టాం. పీకే, ఎమ్‌ఎస్‌, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్‌ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో సినిమా తీయబోతున్నాం. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో అర్థం చేసుకోవటానికి ఎటువంటి బహుమతులు ఇవ్వబడవు’’ అని తెలిపాడు.

పనిలో పనిగా ‘పవర్ స్టార్’లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చేస్తున్న ఆర్టిస్ట్‌కి సంబంధించిన ఓ వీడియో కూడా విడుదల చేశాడు. ‘‘నా కొత్త సినిమా ‘పవర్ స్టార్’లో హీరో ఇతనే . అతను మా ఆఫీస్‌కి వచ్చినప్పుడ ఈ వీడియో షూట్ చేశాం. సాధారణంగా వ్యక్తిని పోలిన వ్యక్తులు ఉండడం అన్నది యాదృచ్ఛికం కాని యాదృచ్ఛికం.. ఉద్దేశపూర్వకం కాని ఉద్దేశపూర్వకం’’ అంటూ తన స్టైల్లో ట్వీట్ చేసాడు.