బిగ్ బాస్ 14వ సీజన్ కోసం సల్మాన్ ఎంత తీసుకున్నాడో తెలుసా..?

నార్త్ లో సూపర్ సక్సెస్ ఫుల్ రియాల్టీ షో అంటే ఎవరైనా బిగ్ బాస్ అనే చెపుతారు. గత 13 ఏళ్లు గా ఈ షో హిందీ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం 14 వ సీజన్ కోసం బిగ్ బాస్ యాజమాన్యం సన్నాహాలు చేస్తుంది.

ఈ సీజన్ కోసం సల్మాన్ భారీ మొత్తం లో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు అని సమాచారం. ఈ షో మొత్తం 100 రోజులు నడుస్తుంది. అయితే ఇందులో సల్మాన్ ఒక్క రోజుకు 16 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట! బిగ్ బాస్ లో సల్మాన్ కేవలం శని, ఆది వారలు మాత్రమే కనిపిస్తాడు. అంటే షో మొత్తంలో 28 రోజులు మాత్రమే. అయితే ఒక్క రోజుకు సల్మాన్ 16 కోట్లు తీసుకుంటే 28 రోజులకు మొత్తం 448 కోట్లు సల్మాన్ అందుకుంటున్నాడన మాట. మరి ఈ రెమ్యూనరేషన్ వార్తలు నిజమా కదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.