మ‌హేష్ కూతురు చిన్న‌నాటి ఫోటో వైరల్

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌ సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. మహేష్ సినిమా తాలూకా విశేషాలే కాక పిల్లలకు సంబందించిన ప్రతి విషయాన్నీ అభిమానులకు షేర్ చేస్తుంటుంది.

తాజాగా సితార‌కి సంబంధించిన చిన్న నాటి ఫోటోని షేర్ చేసింది. న‌మ్ర‌త షేర్ చేసిన ఫోటోలో సితార వివిధ ర‌కాలు ఎక్స్‌ప్రెష‌న్స్ ఉన్నాయి. ఎంతో ముద్దుగా ఉన్న సితార‌కి నెటిజ‌న్స్ నుండి కామెంట్ల వ‌ర్షం కురుస్తుంది. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా సితార త‌న తండ్రి సినిమా పాట‌ల‌కి డ్యాన్స్ చేయ‌డం లేదంటే ఫ‌న్ వీడియోలు చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే.