హాలీవుడ్ ఫై కన్నేసిన శృతి

కమల్ కూతురి గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన శృతి హాసన్..కెరియర్ మొదట్లోనే ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకొని..ఆ తర్వాత గోల్డెన్ గా లెగ్ మారింది. వరుస సక్సెస్ లు అమ్మడిని పలకరించడం తో అగ్ర హీరోల ఛాన్సులు తలుపు తట్టాయి. కానీ అమ్మడు మాత్రం వాటిని కాదని ప్రేమలో పడి సినిమాలకు దూరం అయ్యింది. ఇక ప్రేమ విఫలం కావడం తో మళ్లీ సినిమాల ఫై ఫోకస్ పెట్టింది.

ప్రస్తుతం తెలుగు లో రవితేజ సరసన క్రాక్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో బాగా యాక్టివ్ అయినా ఈ భామ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ భామ హాలీవుడ్ ఫై కన్నేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శృతి హాసన్ అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ “టెడ్స్టోన్”లో నటించే అవకాశం దక్కింది. అంతర్జాతీయ వెబ్ సిరీస్గా రూపొందనున్న “ట్రెడ్ స్టోన్”ని రామిన్ బహ్రానీ తెరకెక్కించనున్నారు. ఢిల్లీలో ఒక హోటల్లో వెయిట్రెస్గా పని చేస్తూ రహస్యంగా హత్యలు చేసే యువతిగా శృతి నటించనుందని సమాచారం.