కేజీఎఫ్‌ 2 లో ఈగ ఫేమ్..?

కేజీఎఫ్‌..ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. కన్నడ చిత్రమైనప్పటికీ అన్ని భాషల్లో డబ్ అయి రికార్డ్స్ బ్రేక్ చేసింది. అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేయగా ..యష్ హీరోగా నటించారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి కొన‌సాగింపుగా చాప్ట‌ర్ 2ని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఫ‌స్ట్ పార్ట్‌లో అధీరా అనే పాత్ర‌ని సస్పెన్స్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. సెకండ్ పార్ట్ లో ఆ పాత్ర కోసం కన్నడ నటుడు సుదీప్ ను ముందుగా సంప్రదించారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆ పాత్ర ఫై ఆ వార్త ఫై సుదీప్ క్లారిటీ ఇచ్చారు.

‘‘నిజంగా ఆ వార్తలలో నిజంలేదు. ఈ సినిమా కోసం నన్ను ఏ పాత్ర కోసం ఎవ్వరూ సంప్రదించలేదు. కె.జి.ఎఫ్ చాప్టర్ 1 కోసం మాత్రం సినిమా చూడటానికి ఆహ్వానం పంపించారు. అంతే తప్ప ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలలో నిజం లేదు. ఇక ‘అధీరా’ పాత్ర సంజయ్‌దత్ సార్ చేస్తున్నారని తెలిసింది. ఆయన చేస్తున్నాడంటే ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది. ఈ విషయంలో నేను చాలా హ్యాపీ..’’ అని సుదీప్ తెలిపాడు.