మెగా అల్లుడు ‘సూపర్ ‘ షూటింగ్ స్టార్ట్

లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా సినిమా షూటింగ్ లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా కేంద్ర ఇచ్చిన సడలింపుల కారణంగా మళ్లీ షూటింగ్ లకు అనుమతి ఇచ్చారు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దీంతో మళ్లీ నటి నటులు షూటింగ్ లతో బిజీ అయ్యారు.

లాక్‌డౌన్‌ను ఎత్తివేశాక కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సూపర్ మచ్చి’ సినిమా షూటింగ్ నిన్న (సోమవారం) రామానాయుడు స్టూడియోస్‌లో పునఃప్రారంభమైంది. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లు కల్యాణ్‌దేవ్‌, రచితా రామ్‌తో పాటు ఒక కీలక పాత్ర చేస్తున్న అజయ్‌పై కొన్ని ప్రధాన సన్నివేశాలు చిత్రీకరించారు. కరోనా గైడ్‌లైన్స్ పాటిస్తూ షూటింగ్ జరిపామని చిత్ర బృందం తెలిపింది.