ప్రముఖ నటుడు ఆత్మ హత్య

ఈ మధ్యనే బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మ హత్య చేసుకొని అందరికి షాక్ ఇవ్వగా..తాజాగా మరో యువ నటుడు ఆత్మ హత్య చేసుకొని చిత్ర సీమా ను శోకసంద్రంలోకి పడేసాడు. ప్రముఖ కన్నడ టీవీ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని మాండ్యలో ఉన్న తన ఇంట్లో సుశీల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. సుశీల్ గౌడ వయసు 30 సంవత్సరాలు. సుశీల్ ఆత్మహత్య చేసుకోవడం కన్నడ సినిమా, టీవీ పరిశ్రమను షాక్‌కు గురిచేసింది.

ప్రస్తుతం ఆయన కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. దునియా విజయ్ హీరోగా వస్తోన్న ‘సలగ’ సినిమాలో సుశీల్ పోలీసు అధికారి పాత్ర పోషించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సుశీల్ ఆత్మహత్య చేసుకున్న వార్త తెలిసిన తరవాత హీరో దునియా విజయ్ కూడా ఫేస్‌బుక్ ద్వారా స్పందించారు. కన్నడలో ఆయన పోస్ట్ చేశారు.