తమన్నా ‘ఆహా’ అనిపిస్తుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మెగా ప్రొడ్యూసర్ గా ఎంతో గుర్తింపు ఉన్న అల్లు అరవింద్ తాజాగా డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌ సంస్థలు మార్కెట్ లో ఓ రేంజ్ లో లాభాలు గడిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆల్ట్ బాలాజీ భార‌తీయ డిజిట‌ల్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కూడా సొంతం గా ‘ఆహా’ పేరిట డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు.

‘ఆహా` డిజిట‌ల్ యాప్ ప్ర‌చార క‌ర్త‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ ను ఎంపిక చేసుకొని పలు యాడ్స్ ప్రచారం చేసారు. ఆహా యాప్ తెలుగు వారికి మరింత చేరువ చేయడానికి అల్లు అరవింద్ ఇప్పటికే పలువురు దర్శకులు, కంటెంట్ రైటర్లను రంగంలోకి దించారు. అంతేకాకుండా హీరోయిన్లకు సైతం వెబ్ సిరీస్ లో నటించడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే హెబ్బా పటేల్ తో ఆహాలో ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. కాగా ఇప్పుడు పాయల్ రాజ్ పుత్ కూడా ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్దమవుతోందని టాక్. కాగా అల్లు అరవింద్ స్టార్ హీరోయిన్ తమన్నా ను ఓ టాక్ షో కోసం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహా యాప్ లో ఓ స్పెషల్ టాక్ షో లో తమన్నా నటించనున్నట్టు సమాచారం.