ఆడిషన్స్ మొదలుపెట్టిన తేజ

నేనే మంత్రి నేనే రాజు ..సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన డైరెక్టర్ తేజ..ఆ తర్వాత కాజల్ తో సీత చిత్రాన్ని చేసి భారీ డిజాస్టర్ ను చవిచూశాడు. ఆ తర్వాత రెండు సినిమాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఒకటి ‘అలివేలు వేంకటరమణ’ కాగా రెండోది ‘రాక్షస రాజు.. రావణాసురుడు’.

గోపీచంద్ తో ‘అలివేలు వేంకటరమణ’ , రానా తో ‘రాక్షస రాజు.. రావణాసురుడు’ చేయబోతున్నాడు. ముందుగా ‘రాక్షస రాజు.. రావణాసురుడు’ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అయితే ఈ సినిమాలో ఎక్కువ మందిని కొత్తవారినే తీసుకోవడానికే ప్లాన్ జరుగుతుంది. అందువల్ల ఆన్ లైన్లో ఆడిషన్స్ ని నిర్వహించడానికి సిద్ధం అవుతున్నాడట.అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ తాజాగా ఆడిషన్స్‌లో పాల్గొనే వారు ఏం చేయాలనే వివరాలతో పాటు ఏఏ పాత్రల నటీనటులు కావాలో లిస్ట్‌ని విడుదల చేసింది. సోషల్‌మీడియా ద్వారా ఆడిషన్స్ లో పాల్గొనే వారు నాలుగు వెస్ట్రన్‌, ట్రెడిషనల్ ఫోటోలు అప్‌లోడ్ చేయాలని అన్నారు. అంతేకాక ఇంట్రడక్షన్‌, కామెడీ,సీరియస్‌, ఎమోషనల్‌కి సంబంధించిన వీడియోలు కూడా షేర్ చేయాలని తెలిపారు.