తేజస్వి ని హాట్ పోస్టర్ ..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ రోల్స్ లలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజస్విని ..బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ క్రేజ్ తో భారీ ఆఫర్లే వస్తాయని భావించింది కానీ అమ్మడి కోరిక తీరలేదు. దీంతో అందాల ప్రదర్శన ఫై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ భామ కమిట్మెంట్ అనే ఓ సినిమాలో బోల్డ్‌గా కనిపించనుంది. లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో ముఖ్యంగా సినీ పరిశ్రమలో హీరోయిన్స్ పడే ఇబ్బందులు, వారు ఎదుర్కోనే వేధింపులు, ఎలా మోసగిస్తారో.. ఇలా పలు అంశాలను చర్చించనున్నారు. ఇక ఈరోజు తేజస్వి 30 వ అడుగుపెడుతున్న సందర్భంగా ఆ సినిమా నుండి ఈ భామకు సంబందించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. బోల్డ్ లుక్ లో దర్శనం ఇచ్చి అబ్బా అనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది.