వకీల్ తో బన్నీ మూవీ

అల వైకుంఠపురం లో చిత్రం తో బ్లక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్..ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప మూవీ చేస్తున్నాడు. ఈ రెండిటికంటే ముందే వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ఐకాన్ మూవీ కి ఓకే చెప్పాడు. ఇక సెట్స్ పైకి వెళ్లడమే అనుకునే టైం లో ఈ మూవీ కి బ్రేక్ ఇచ్చి త్రివిక్రమ్ తో సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.

దర్శకుడిగా వేణు శ్రీరామ్ కి పెద్దగా హిట్ ట్రాక్ లేదు. అందుకే బన్నీ ఆ ప్రాజెక్ట్ ని అప్పుడు పక్కన పెట్టారు. కాగా వేణు శ్రీరామ్ ప్రస్తుతం పవన్ తో వకీల్ సాబ్ చేస్తున్నారు. ఈ మూవీ ఫలితాన్ని బట్టి అల్లు అర్జున్ ఐకాన్ మూవీ చేయాలనీ అనుకుంటున్నాడట. మరి వకీల్ సాబ్ ఏంచేస్తాడో చూడాలి.