‘వకీల్’ ఎప్పుడు వస్తున్నాడంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా పింక్ చిత్రానికి రీమేక్ గా వకీల్ సాబ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు , బోణి కపూర్ లు సంయుక్తంగా తెలుగు లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి రాగా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ లకు బ్రేకుపడింది. రీసెంట్ గా షూటింగ్ లకు అనుమతి రావడం తో షూటింగ్ కు సిద్ధం అవుతున్నారు.

ఇదిలా ఉండగా మరోపక్క అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం దసరా రేస్ లోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది.