షాక్ : పవన్ ‘వకీల్ సాబ్ ‘ కోర్ట్ సీన్ లీక్

వకీల్ సాబ్ చిత్ర యూనిట్ కు షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కు సంబందించిన కోర్ట్ సీన్ పిక్ లీక్ అయ్యింది. ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ గత కొంతకాలంగా కరోనా విజృంభణ వల్ల వాయిదా పడింది.

ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా జాగ్రత్త పడుతూ వస్తున్న చిత్ర యూనిట్‌కి సడెన్ షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్‌లో కోర్టులో వాదిస్తున్న స్టిల్ ఒకటి లీక్ అయింది. ఇది కాస్త వెంటనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ స్టిల్ ఎలా లీక్ అయ్యిందనే విషయమై ఆరా దీస్తున్నారు యూనిట్ సభ్యులు. ఈ లీక్ అయినా పిక్ చూస్తుంటే ఎడిటింగ్ నుండి బయటకు వచ్చినట్లు అర్ధమవుతుంది. పిక్ మాత్రమేనా వీడియో కూడా బయటకు వచ్చిందా అనే కోణంలో యూనిట్ సభ్యులు విచారిస్తున్నారు.