విశాల్ చిత్రానికి ‘చక్ర’ టైటిల్

హిట్..ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్న తమిళ్ హీరో విశాల్ ప్రస్తుతం ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రమణ్యం డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఈ చిత్రానికి తెలుగు లో చక్ర అనే టైటిల్ ఫిక్స్ చేసారు. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ ను సోమవారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ విశాల్ ను కొత్త రీతిలో ప్రెజెంట్ చేస్తోంది. ఈ పోస్టర్ ను బట్టి ఈ చిత్రం కూడా మరో యాక్షన్ థ్రిల్లర్ గా రానుందని అర్ధం అవుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ రెజీనా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో విశాల్ సరసన హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది.