Kubera : ‘కుబేర’ గా వస్తున్న ధనుష్.. కానీ ?


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, దర్శకుడు శేఖర్ కమ్ముల తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. #DNS అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ బ్యానర్ పై సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ & టైటిల్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

Bhimaa Review | భీమా రివ్యూ : మాస్ ట్రీట్

ఈ సినిమాకు ‘కుబేర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. కుబేరుడు చాలా ధనవంతుడు.. కానీ ఈ పోస్టర్ లో ధనుష్ మాత్రం బిచ్చగాడిలా కనిపిస్తాడు. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పటివరకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా, మనసుకి హాయిగా అనిపించేలా, చాలా పీస్ ఫుల్ గా ఉంటాయి. మరి ఇప్పుడు ఈ సినిమా టైటిల్ చూస్తుంటే శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని చాలా భిన్నంగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

NBK 109 Glimpse : హంటింగ్ మొదలెట్టిన బాలయ్య..