Site icon TeluguMirchi.com

Gaami Review | గామి రివ్యూ : డీసెంట్ అట్టెంప్ట్

Gaami Review

TeluguMirchi Rating : 3.25/5
మాస్ క దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘గామి’ శివరాత్రి కానుకగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగానే విశ్వక్ సేన్ అఘోర పాత్ర చూసి సినిమాపై భారీగా హైప్ పెరిగింది. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది. అఘోరాగా విశ్వక్ సేన్ ప్రేసకులను మెప్పించాడా ? సినిమా ఎలా ఉంది తెలుసుకోవాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే ..

కథ :

శంకర్ (విశ్వక్ సేన్) హరిద్వార్‌లో ఉండే ఓ అఘోరా. తనకి ఉన్న ఒక లోపం కారణంగా ఈ ప్రపంచంలో ఇమడ లేకపోతాడు. ఇతడి వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని మిగతా అఘోరాలు అందరూ ఇతడిని ఆశ్రమం నుంచి వెళ్లగొడతారు. దీంతో తన సమస్యకు పరిష్కారం తెలుసుకునేందుకు కాశీకి వెళ్తాడు. అక్కడ ఓ సాధువు వల్ల శంకర్ సమస్యకు హిమాలయాల్లో 36 ఏళ్లకు ఓసారి లభించే మాలిపత్రాల్లో ఉందని తెలుసుకుంటాడు. దీంతో శంకర్ హిమాలయాలకు ప్రయాణం మొదలుపెడతాడు. ఇతడికి జాహ్నవి (చౌందిని చౌదరి) కూడా తోడు వెళ్తుంది. మాలి పత్రాలు సాధించే క్రమంలో అతనికి ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి? అలానే శంకర్ ఆలోచనల్లో వచ్చే ఉమ (హారిక పెద్ద), సీటీ-333(మహమ్మద్ సమాద్) ఎవరు? అసలు జాహ్నవి శంకర్ కి తోడుగా ఎందుకు వెళ్తుంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Kalki 2898 AD : భైరవ గా ప్రభాస్.. లుక్ అదుర్స్ !

మాస్, కమర్షియల్ పాత్రలతో మనకు తెలిసిన విశ్వక్ సేన్.. ఇందులో శంకర్‌గా అఘోరా పాత్రలో వొదిగిపోయాడనే చెప్పాలి. సినిమా అంతా కూడా ఒకే కాస్ట్యూమ్‌లో ఉంటాడు. ఇక సీటీ-333 పాత్ర చేసిన మహమ్మద్ సమాద్, దుర్గ పాత్ర చేసిన హారిక అనే చైల్డ్ ఆర్టిస్టు వాళ్లకిచ్చిన పాత్రల్లో ఆకట్టుకున్నారు. చాందిని చౌదరి రోల్‌ ఉన్నంతలో బాగా చేసింది. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ప్లస్ పాయింట్స్:

కథ, స్క్రీన్‌ప్లే
విశ్వక్‌ నటన
విజువల్‌ ఎఫెక్ట్స్, విరామ.. పతాక సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :

నెమ్మదిగా సాగే కథనం
లాజిక్‌ లేని కొన్ని సీన్స్‌

ఫైనల్ పాయింట్ : డీసెంట్ అట్టెంప్ట్

Exit mobile version