Kalki 2898 AD : భైరవ గా ప్రభాస్.. లుక్ అదుర్స్ !


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఒక సాంగ్ షూటింగ్ కోసం చిత్రబృందం ఇటలీ వెళ్ళింది. ఇక మే 9న రిలీజ్ కాబోయే ఈ చిత్రం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది.

Gaami Review | గామి రివ్యూ : డీసెంట్ అట్టెంప్ట్

ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరును రివీల్ చేశారు మేకర్స్. ప్రభాస్ పాత్ర పేరు భైరవ అంటూ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ చాలా స్టైలిష్ గా వుంది. ఇప్పుడు ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.