RC16 : రామ్ చరణ్ కి జోడిగా ‘దేవర’ బ్యూటీ !


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ #RC16 కోసం ‘ఉప్పెన’ ఫేమ్ యువ మరియు ప్రతిభావంతులైన దర్శకుడు బుచ్చి బాబు సాన తో జతకట్టనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సగర్వంగా సమర్పిస్తున్న ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ను అందించారు మేకర్స్.

ఇటీవలే ఈ చిత్రంలో హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అందరూ అనుకున్నట్లే RC16 లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. ఈరోజు ఆమె బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం పలికారు. ఇప్పటికే జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో ‘దేవర’ సినిమాలో నటిస్తుంది. ఇకపోతే ఈ మెగా వెంచర్‌కి, ఆస్కార్ విజేత AR రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు మేకర్స్.