Om Bheem Bush : ‘ఓం భీం బుష్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !!


బ్రోచేవారెవరురా సినిమాతో మంచి హిట్ అందుకున్న శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి మరో సరికొత్త కామెడీ ఎంటర్టైనర్ ‘ఓం భీమ్ బుష్’ తో రాబోతున్న సంగతి తెలిసిందే. హుషారు ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్ మరియు సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ-లుక్ గ్లింప్స్, ఫస్ట్-లుక్ పోస్టర్‌, టీజర్, బ్యాంగ్ బ్రోస్.. పాటకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఇప్పుడు మరో అప్డేట్ తో వచ్చింది చిత్రయూనిట్.

Family Star : విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి పెళ్లి పాట వచ్చేసింది..

‘ఓం భీం బుష్’ ట్రైలర్ ను మార్చి 15న, 4 గంటల 59 నిముషాలకు లాంచ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక ఈ చిత్రానికి సన్నీ ఎం.ఆర్ సంగీతం అందిస్తున్నారు. ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘ఓం భీమ్ బుష్’ మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.