Rashmika Mandanna : ‘కుబేర’ గ్లింప్స్.. గొయ్యి తవ్వుతున్న రష్మిక !!


నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ సోషల్ డ్రామా ‘కుబేర’ మోస్ట్ ఎవెయిటింగ్ పాన్-ఇండియన్ చిత్రాలలో ఒకటి. ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లగా నటిస్తుండగా కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే కుబేర నుంచి విడుదలైన సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున ఫస్ట్ లుక్‌లు అందరినీ ఆకట్టుకోగా, తాజాగా ఈ చిత్రం నుంచి రష్మిక మందన్న ఫస్ట్‌లుక్ గ్లింప్స్‌ రిలీజ్ చేసారు మేకర్స్.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

Janaka Aithe Ganaka Teaser : పిల్లలు వద్దంటున్న సుహాస్..

ఫస్ట్ లుక్ పోస్టర్ లో పింక్ కలర్ డ్రెస్సులో వున్న రష్మిక చేత్తో సూట్ కేస్ తో వస్తున్న లుక్ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ లుక్ తో పాటు చిన్న గ్లింప్స్‌ కూడా వదిలారు. ఈ వీడియోలో నిర్మానుష్యంగా ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిన రష్మిక, గడ్డపారతో గొయ్యి తవ్వి గుంతలో పూడ్చి పెట్టిన సూట్ కేస్ ను బయటకు తీసింది. అది ఓపెన్ చేస్తే అందులో అంతా డబ్బే ఉంది. అంత డబ్బును చూసిన రష్మిక సంతోషంతో ఆ సూట్ కేసు తీసుకొని వెళ్తుంది. మొత్తానికి ఈ గ్లింప్స్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. అంతేకాదు దేవి శ్రీ ప్రసాద్ యొక్క రాకింగ్ సంగీతం ఆకట్టుకుంటుంది.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఇకపోతే శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ ను తమిళం, తెలుగు, హిందీ లో ఏకకాలంలో షూటింగ్ చేస్తున్నారు.