Sundeep Kishan : ‘ధమాకా’ డైరెక్టర్ తో సందీప్ కిషన్ నెక్స్ట్ మూవీ..


‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సందీప్ కిషన్‌ ఈరోజు తన ల్యాండ్‌మార్క్ 30వ సినిమాని అనౌన్స్ చేశారు. ‘ధమాకా’ వంటి భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన #SK30కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి వరుస హిట్‌ల తర్వాత, వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేయడానికి ప్రొడక్షన్ హౌస్‌లు ఈ సినిమా కోసం మళ్లీ జతకట్టాయి.

Aa Okkati Adakku : ‘ఆ ఒక్కటీ అడక్కు’ టీజర్.. అల్లరోడి అల్లరి మామూలుగా లేదుగా !

పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ కొత్త చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్‌లను అందిస్తున్నారు. రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విభిన్నమైన స్క్రిప్ట్‌లతో అలరించే సందీప్ కిషన్ #SK30 లో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఇక ఈసినిమా గ్రాండ్ ప్రొడక్షన్ మరియు సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందించబడుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.