నీటి కొరత మొదలైందా? ఈ డాక్టర్ చెబుతున్న పొదుపు చిట్కాలు పాటించండి


వేసవికాలం వచ్చిందంటే చాలా నీటి కొరత తప్పదు. బెంగళూరు వంటి సిటీలు సైతం నీటి ఎద్దడితో సతమతమైపోతుంటాయి. ఇక వేసవికాలంలో ఈ సమస్యను అధిగమించాలంటే నీటిని పొదుపు చేయాల్సిందే. బెంగూళురుకు చెందిన దివ్య శర్మ అనే వైద్యురాలు వేసవిలో నీటి సంక్షోభం నుండి ఎలా బయటపడాలో చిట్కాలు చెబుతున్నారు. ఈ డాక్టర్ చెప్పిన చిట్కాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వేసవికాలం వచ్చిందంటే నీటి సంక్షోభం తప్పదు. కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య మరింత వేధిస్తుంది. టెక్ హబ్ గా పేరున్న బెంగళూరును ఈ సమస్య పట్టి పీడిస్తుంది. దీని నుండి బయటపడాలంటే మంచినీరు పొదుపు చేయాల్సిందే. అందుకోసం దివ్య శర్మ అనే చర్మవ్యాధి వైద్యురాలు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. చాలామంది బాత్రూమ్ లలో షవర్ బాత్ ప్రిఫర్ చేస్తారు. దీని వల్ల చాలా నీరు వేస్ట్ అవుతుంది. అలా కాకుండా బకెట్ బాత్ చేయడం వల్ల నీటిని పొదుపు చేయవచ్చని దివ్య చెబుతున్నారు. షవర్ బాత్ వల్ల నిముషానికి 13 లీటర్ల నీరు వేస్ట్ అవుతుందట. ఇక 5 నిముషాల షవర్ బాత్ వల్ల ఎంత నీరు వేస్ట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. ప్రతి నీటి ట్యాప్ వద్ద ఏరేటర్లను ఫిక్స్ చేయడం ద్వారా డిష్ వాషింగ్ 90 లీటర్ల నీరును ఆదా చేయవచ్చట. అంతేకాదు RO నీటిలో ఉండే వ్యర్థాలను కంటైనర్లలో సేకరించి ఆ నీటిని తోట పనికి.. మాపింగ్ కి కూడా వాడుతున్నారు. ఇలా కూడా 30 లీటర్ల నీరు ఆదా అవుతుందట.

ఇంకా ఈ సీజన్ లో కార్ వాష్ కి ఇవ్వకుండా ప్రతిరోజు కారు దుమ్ము దులపడం.. తడిగుడ్డతో శుభ్రపరుచుకోవడం మంచిది. పైపు లీకేజీలు తొలగించడం ద్వారా కూడా 30 లీటర్ల నీరు ఆదా చేయవచ్చునట. నలుగురు వ్యక్తులు ఉన్న ఒక ఇంట్లోనే 600 లీటర్ల నీటిని ఆదా చేయగలిగినపుడు ప్రతి ఇంట్లో ఈ చిట్కాలు పాటిస్తూ చేసే చిన్న పొదుపు మంచి నీటి సంక్షోభం నుండి రక్షించగలదని దివ్య శర్మ చెబుతున్నారు. ఈ చిట్కాలు చూస్తుంటే చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరూ నీటి పొదుపు పట్ల బాధ్యతగా వ్యవహరిస్తే ఈ సీజన్ లో నీటి ఎద్దడి నుండి బయటపడొచ్చు. ప్రస్తుతం ఈ వైద్యురాలు చెప్పిన చిట్కాలు వైరల్ అవుతున్నాయి.