చరిత్ర సృష్టించిన లిటన్‌ దాస్‌.. 16 ఏళ్ళ రికార్డు బద్దలు


బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌ తరఫున #T20 ఫార్మాట్లో అత్యంత వేగవంతంగా అర్ధ శతకం పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఐర్లాండ్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

చట్టోగ్రామ్‌ వేదికగా జరిగిన రెండో టీ20 సందర్భంగా 18 బంతుల్లో 50 పరుగులు మార్కును అందుకున్నాడు. తద్వారా మహ్మద్‌ అష్రాఫుల్‌ పేరిట ఉన్న రికార్డును లిటన్‌ దాస్‌ బద్దలు కొట్టాడు. కాగా 2007 టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆష్రాఫుల్‌ 20 బంతులో హాఫ్‌ సెంచరీ చేశాడు.

జొహన్నస్‌బర్గ్‌లోని వాండరర్స్‌ స్టేడియంలో ఈ ఘనత సాధించాడు. లిటన్‌ దాస్‌కు తోడు మరో ఓపెనర్‌ రోనీ టాలూక్దర్‌ 44 పరుగులతో రాణించగా.. 202 పరుగుల భారీ స్కోరు చేసింది బంగ్లాదేశ్‌. వర్షం కారణంగా 17 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో 77 పరుగుల తేడాతో బంగ్లా గెలుపొందింది.