Site icon TeluguMirchi.com

రాష్ర్ట బడ్జెట్ – 2013 రూపకల్పన

anam ramnarayanareddyరాష్ర్ట బడ్జెట్ – 2013 రూపకల్పనకు కసరత్తు మొదలైనట్టు తెలుస్తోంది. బడ్జెట్ రూపకల్పనను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఆయా శాఖల అధికారులతో భేటీలను ప్రారంభించారు. సచివాలయంలో ఈరోజు ఉదయం వ్యవసాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సమావేశమై బడ్జెట్ డిమాండ్లపై, కేటాయింపులపై సలహాలు, సూచనలు స్వీకరించిట్లు సమచారం. రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో 2012 బడ్జెట్ మాదిరిగానే బడ్జెట్-2013లో కూడా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి మరిన్ని ప్రజాకర్షక పథకాలతో బడ్జెట్ ప్రజల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version