Site icon TeluguMirchi.com

బాబాయ్ ని ఆకాశానికి ఎత్తేసిన చరణ్


ప్రవాస గర్జనతో బిజీగా వున్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. ప్రవాస గర్జనలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్నారు. డల్లాస్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ వేదికపై ప్రసంగించారు. ‘నిజమైన ధైర్యం అంటే భయం లేకపోవటం కాదు.. రోజూ భయాన్ని ఎదుర్కోవడం. నా జీవితాన్ని దేశం కోసం, సమాజం కోసం, రాష్ట్రాల కోసం, మానవత్వం కోసం కేటాయించాలని నిర్ణయించుకున్నా…’ అంటూ ఆయన ఉద్వేగ పూరిత ప్రసంగం చేశారు.

దీనిపై రామ్ చరణ్ స్పదించారు, ‘భయాన్ని అధిగమించాలంటే మిమ్మల్ని భయపెట్టే పనినే రోజూ చేయండి. భయంలోని మార్పును ఎదుర్కోలేకపోవడమే పెద్ద భయం. నేను ఇంత వరకూ ఎప్పుడూ వినని ఓ గొప్ప స్ఫూర్తిదాయకమైన ప్రసంగం ఇది. పవన్‌ కల్యాణ్‌ ఓ గొప్ప నాయకుడు’అని ట్వీట్ చేశారు చరణ్.

Exit mobile version