Site icon TeluguMirchi.com

అఫ్ఘానిస్తాన్ నూతన అధ్యక్షుడిగా అష్రాఫ్ ఘనీ

Afghan అఫ్ఘానిస్తాన్ నూతన అధ్యక్షుడిగా ఆ దేశ మాజీ ఆర్థిక మంత్రి అష్రాఫ్ ఘనీ ఎన్నికయ్యారు. జూన్ 14న జరిగిన ఎన్నికల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు. ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రస్తుతం కౌంటింగ్ నడుస్తోంది. అయితే అధ్యక్ష పదవికి తనపై పోటీకి దిగిన అబ్దుల్లా అబ్దుల్లాతో కుదిరిన రాజీ ఒప్పందం నేపథ్యంలో ఘనీ అధ్యక్ష పీఠం ఎక్కేందుకు మార్గం సుగమమైంది.

ఆదివారం కాబూల్ లోని అధ్యక్ష భవనంలో జరిగిన కార్యక్రమంలో ఘనీ, కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తనతో రాజీ ఒప్పందం చేసుకున్న అబ్దుల్లా అబ్దుల్లాను ప్రధాని హోదాకు సమానమైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించేందుకు ఘనీ ఒప్పుకున్నారు. దీంతో మూడు నెలలుగా దేశంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది.

Exit mobile version