Site icon TeluguMirchi.com

’అమ్మ’ ఎప్పుడూ నిరాశపరచదు : ప్రధాని

mam’మామ్’ అంటే ’అమ్మ’. అమ్మ మనల్ని ఎప్పుడూ నిరాశపరచదు. ’అమ్మ’లాగే మామ్ విజయతీరాలకు చేర్చిందని.. ప్రయోగాన్ని ప్రత్యేక్షంగా వీక్షించిన ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రయోగం విజయవంతం కాగానే ప్రధాని శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతరిక్ష పరిశోధనల్లో ఆసియాలోనే భారత్ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అరుణగ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన నాలుగో దేశంగా భారత్ నిలిచిందని ప్రధాని అన్నారు. తొలి ప్రయత్నంలోనే మనం విజయం సాధించామని శాస్త్రవేత్తలను ప్రశంసించారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్‌ కన్నా మామ్ ప్రయోగం బడ్జెట్ తక్కువని మోడీ వ్యాఖ్యానించారు. అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన తొలి ఆసియా దేశంగా భారత్ నిలిచిందన్నారు. మన శాస్త్రవేత్తలు కోఠర శ్రమతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నారు.

Exit mobile version