Site icon TeluguMirchi.com

ఎంపీ టికెట్టా.. చాకోలెట్టా.. పవనూ

రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , అన్నయ్య నాగబాబు కి టికెట్టు ఇచ్చిన వైనం చుస్తే ఈ సామెత గుర్తుకు వస్తుంది. కొత్త తరం రాజకీయాలకు నాంది పలుకుతాని చెప్పిన పవన్ కళ్యాణ్.. కుటుంబ రాజాకీయాలని ప్రోత్సహిస్తున్న వైనం ఇది. ఎంపీ టికెట్టు అంటే మాటలా ? కానీ నాగబాబుకి ఈ టికెట్ చాకోలెట్ ఇచ్చనంత ఈజీగా ఇచ్చారు తమ్ముడు జనసేనాని.

నాగబాబుకి టికెట్ ఇవ్వడాన్నీ తప్పుపట్టడం లేదు. ఐతే ఇచ్చిన వైనం మాత్రం చిత్రం. పార్టీ జెండా మోసిన వాడికే టికెట్ అన్నారు పవన్. ఇది సాధ్యం కాదని తెలుసు. కానీ జనసేన పార్టీలో చేరిన మొదటి రోజే బొకే ఇచ్చినట్లు ఎంపీ టికెట్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. బాహుస పార్టీలో చేరిన వెంటనే బీఫామ్ అందుకున్న లీడర్ గా నాగబాబు చరిత్రలో నిలిచిపోతాడేమో.

Exit mobile version