Site icon TeluguMirchi.com

రెండో విడత ‘సహకార’ సమరం

sahakara-electionsరాష్ర్టంలో సహకార ఎన్నికల రెండో విడతలో మరిన్ని స్థానాలు గెలుచుకుని పట్టు నిలుపుకోవాలని రాజకీయ పార్టీలు వ్యూహం సిద్ధం చేసుకున్నాయి. రాష్ట్రంలోని 8 జిల్లాల్లోని 940 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా 14 జిల్లాల్లో జనవరి 31న సహకార ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

రెండో విడతలో భాగంగా 1484 ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు ప్రకటించారు. అయితే అందులో ఇప్పటికే 475 సహకార సంఘాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక మిగిలిన వాటిలో 68 సహకార సంఘాలకు ప్రభుత్వం ఎన్నికలు జరపకుండా స్టే ఇచ్చింది. మరో సంఘానికి న్యాయస్ధానం స్టే మంజూరు చేసి ఎన్నిక నిలిపివేసింది. కాగా, ఈరోజు ప్రారంభమైన సహకార ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్తతలకు దారి తీసినట్టు సమాచారం.

Exit mobile version