Site icon TeluguMirchi.com

తెలంగాణ కు నెక్స్ట్ సీఎం ఆయనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎక్సైజ్ శాఖా మంత్రి

తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అంటూ సంచలన కామెంట్స్ చేసారు తెలంగాణ ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి..

దేశమంతా కేసీఆర్ వైపు చూస్తోంటే.. రాష్ట్రంలోని యువత కేటీఆర్ వైపు చూస్తోందని, విజన్ ఉన్న నేత కేటీఆర్ అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ తదనంతరం కేటీఆర్ సీఎం కావడం సహజమైన విషయమేనని అన్నారు. అలాగే ఉత్తమ్ కుమార్ ఫై శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. భార్యను గెలిపించుకునే సత్తా లేని ఉత్తమ్ తమ నాయకుడి గురించి మాట్లాడతారా? అని మంత్రి ప్రశ్నించారు. రెచ్చగొట్టడం, కుల మతాల మద్య చిచ్చు పెట్టడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

Exit mobile version