TG TET Exam : ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష.. ఉత్తర్వులు జారీ..


టెట్ అభ్య‌ర్థుల‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్(టీచ‌ర్ ఎలిజ‌బిలిటీ టెస్ట్) పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలకు ఒకసారి అనగా జూన్, డిసెంబర్ నెలల్లో పరీక్ష నిర్వహించలాని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్​ను ఆదేశించింది. ఒక అభ్య‌ర్థి ఎన్నిసార్లైనా టెట్ రాసుకోవ‌చ్చ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్ పెంచుకునేందుకు మరల రాసుకోవచ్చు అని తెలిపారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

Also Read : ‘కల్కి 2’ లో కృష్ణుడిగా మహేష్ బాబు.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ ?