Site icon TeluguMirchi.com

జనసేన మేనిఫెస్టో కాపీ క్యాట్


జనసేన మేనిఫెస్టో కాపీ క్యాట్ లా ఉందని విమర్శించారు మంత్రి యనమల. ఈ రోజు జనసేన పార్టీ మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి యనమల మాట్లాడుతూ.. పార్టీ 7 సిద్ధాంతాలుగా పేర్కొన్న అంశాలు కూడా కొత్తవేవీ కావని, కుల, మత సామరస్యం, భాషా సంస్కృతులు అన్నీ పాత అంశాలేనన్నారు. మచ్చుతునకలుగా పేర్కొన్నవన్నీ కాపీ తునకలే తప్ప కొత్తవేవీ లేవని ఎద్దేవా చేశారు.

కాపు రిజర్వేషన్ల అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేశామని, తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి పంపామని చెప్పారు. తెదేపా ఎంపీలు దీనిపై పోరాటం చేస్తున్నారన్నారు. రేషన్‌కు బదులుగా నగదు బదిలీ అంశం కూడా కొత్తదేమీ కాదని, అవకాశాన్ని బట్టి బీసీలకు అదనంగా 5శాతం రిజర్వేషన్ల పెంపు అనడంలోనే అవకాశవాదం కనిపిస్తోందని దుయ్యబట్టారు. అగ్రవర్ణాల కోసం కార్పొరేషన్‌ కూడా పాతదేనని, ఇప్పటికే బ్రాహ్మణ, వైశ్య కార్పొరేషన్లు తెదేపా పెట్టిందని బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయిస్తోందని గుర్తుచేశారు.

Exit mobile version