ఎయిరిండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన రూట్లలో దేశీయ విమాన ప్రయాణాలకు మే 4 నుంచి టికెట్ బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది. అలాగే జూన్ 1 నుంచి అంతర్జాతీయ ప్రయాణాలకు బుకింగ్స్ స్వీకరిస్తున్నట్లు తెలిపింది.
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అనంతరం దాన్ని మే 3 వరకు పొడిగించారు. దీంతో అన్ని విమాన సర్వీసులు నిలిచిపోయాయి.
కాగ దేశంలో శనివారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,378కి చేరింది. గడిచిన 24 గంటల్లో 991 కొత్త కరోనా కేసులు నిర్ధారణ కాగా.. 43 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 480కి చేరింది.









