శ్రీకాళహస్తిలో కరోనా కలకలం


చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు జిల్లా కలెక్టర్‌ భరత్‌ గుప్తా తెలిపారు. వీరిలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఇద్దరు మెడికల్‌ దుకాణాల యజమానులు సహా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చెప్పారు. తిరుపతి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో కలెక్టర్‌ వివరాలు వెల్లడించారు

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

కాగ ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో జరిగిన కొవిడ్‌ 19 పరీక్షల్లో 44 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. రాష్ట్రంలో 97 మండలాలు రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.