
తెలంగాణ వ్యాప్తంగా మే 7 వరకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు అనుమతి రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.రేపట్నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు. అంతేకాకుండా ఎలాంటి పండగలైనా పరిమిత సంఖ్యలో ఇళ్లలోనే జరుపుకోవాలని చెప్పారు. రంజాన్ మాసం అయినప్పటికీ ఎలాంటి సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదన్నారు.
తెలంగాణలో ఏప్రిల్ 20 తర్వాత కూడా రాష్ట్రంలో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సడలింపులు ప్రకటించినప్పటికీ, తెలంగాణలో పరిస్థితుల దృష్ట్యా మే 3 వరకు నిబంధనలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గతంలో ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రం నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం ప్రభుత్వం చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.









