ఈ ప్రాంతాలు యమా డేంజర్

ముంబయి, పుణె, ఇండోర్‌, జైపుర్‌, కోల్‌కతా, పశ్చిమ్‌బంగాలోని మరికొన్ని ప్రాంతాల్లో కొవిడ్‌-19 పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లాక్‌డౌన్‌ నియమాలను ఉల్లంఘిస్తే, సరైన చర్యలు తీసుకోకుంటే నావెల్‌ కరోనా వైరస్‌ విపరీతంగా వ్యాపిస్తుందని హెచ్చరించింది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌, మహారాష్ట్రలోని ముంబయి, పుణె, రాజస్థాన్‌లోని జైపుర్‌, పశ్చిమ్‌బంగాలోని కోల్‌కతా, హౌరా, తూర్పు మేదినిపుర్‌, ఉత్తర 24 పరగణాలు, డార్జిలింగ్‌, కలింపాంగ్‌, జల్‌పాయ్‌గుడిలో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని కేంద్రం తెలిపింది.