హైదరాబాద్ నగర వాసులు మారడం లేదు..

తెలంగాణ రాష్ట్రం లో లాక్ డౌన్ ప్రకటించిన కానీ జనాలు మాత్రం ఏదో ఒక పని చెప్పి రోడ్ల పైకి వస్తున్నారు. ముఖాయమగు హైదరాబాద్ వాసులు ఏమాత్రం లాక్ డౌన్ ను పట్టించుకోవడం లేదు. ప్రాణాల కంటే రోడ్ల మీదకు వెళ్లడమే ముఖ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఏమాత్రం సామజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు. కొందరు తమ ప్రాణాలే కాదు, మిగతా వారి ప్రాణాలను కూడా ఇబ్బందుల్లోకి నెడుతున్నారు.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తూ రోడ్ల మీదకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా ఏమాత్రం వినిపించుకోవడం లేదు. వాహనాలు సీజ్ చేస్తున్నా కాస్త భయం లేకుండా పోయింది. నిన్న , ఈరోజు కూడా జనాలు పెద్ద సంఖ్య లో కనిపించడం తో పోలీసులు సీరియస్ అయ్యారు. ఇలా చూస్తూ ఉంటె కష్టమని..కఠినంగా వ్యవహరించడం చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలువరిస్తూ రోడ్లపై అకారణంగా తిరుగుతున్నవారిపై కేసులు పెడుతున్నారు. మరోపక్క నగరంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతుండడం తో అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే చాల ప్రాంతాలు రెడ్ జోన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసారు. అయినాగానీ జనాలు బయటకు వస్తూనే ఉన్నారు.