దేశంలో కరోనా మరణాల జాబితా.. ఫుల్ రిపోర్ట్


భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రం 5గంటల సమయానికి దేశ వ్యాప్తంగా 18,985 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

15వేల మంది ఆయుష్‌ నిపుణులు 17 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల్లో సేవలందిస్తున్నారని ఆరోగ్యశాఖ సంయుక్త కమిషనర్‌ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. అలాగే, 550 జిల్లాల్లో 40వేల మంది రెడ్‌ క్రాస్‌ వాలంటీర్లు పనిచేస్తున్నారన్నారు.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

ఈ మహమ్మారితో పోరాడి ఇప్పటివరకు 3260 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 603 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. దేశంలో కరోనా బారినపడిన వారిలో రికవరీ రేటు 17.47శాతం ఉందని చెప్పారు.