
మహారాష్ట్ర ని కరోనా వణికిస్తోంది. రోజు రోజుకు ఈ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 778 పాజిటివ్ కేసులు నమోదై షాక్ ఇచ్చాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,427కి చేరింది. వీటిలో ఒక్క మహానగరంలోనే 4,232 కేసులు నమోదు అయ్యాయి అంటే అక్కడ కరోనా మహమ్మారి ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.
మొన్నటివరకు సామాన్య జనాల్లో ఉన్న కరోనా ఇప్పుడు ఉద్ధవ్ కేబినెట్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది. ఆ రాష్ట్ర మంత్రి జితేంద్ర అహ్వాద్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 54 ఏళ్ల ఈ ఎన్సీపీ నేత … ముందస్తు చెకప్ కోసం థానేలోని ఒక ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. తన సెక్యూరిటీలో స్టాఫ్‌కు కరోనా సోకడంతో ఆయన కొన్నాళ్ల పాటు స్వచ్ఛందంగా హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఏప్రిల్ 13కు ముందు టెస్టులు చేయించుకున్న జితేంద్రకు… నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. అయితే, తాజా టెస్టులో ఆయనకు పాజిటివ్‌గా వచ్చింది. ఈయన కు పాజిటివ్ రావడం తో మిగతా మంత్రుల్లో టెన్షన్ మొదలు అయ్యింది. ఈయనతో సన్నిహితంగా ఉన్నవారు ప్రస్తుతం టెస్టులు చేయించుకుంటున్నారు.









