
ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా రోగులకు అందిస్తున్న ప్లాస్మా చికిత్స సానుకూల ఫలితాలనిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.ఢిల్లీలో నలుగురు రోగులకు ప్లాస్మా చికిత్స జరిపారు. ఈ ప్రయోగం ఫలితాలు ఆసాజనకంగా ఉన్నాయని కేజ్రీవాల్ చెప్పారు.
‘గత కొద్దిరోజులుగా లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్లో నలుగురు రోగులకు ప్లాస్మా థెరపీ మొదలుపెట్టాం. ఇప్పటివరకైతే ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి’ అని కేజ్రీవాల్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత మందికి ప్లాస్మా థెరపీ జరిపిస్తామని ఆయన చెప్పారు. పరిమిత స్థాయిలో పరీక్షలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని వివరించారు. తీవ్రంగా జబ్బుపడ్డ అందరికీ విస్తృతస్థాయిలో ఈ చికిత్స జరిపేందుకు వచ్చేవారం కేంద్రం అనుమతి కోరుతామని అన్నారు.









