
కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా ఆస్పరి మండలం జొహారాపురం గ్రామంలో 11నెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ కుటుంబానికి సంబంధించిన బంధువు ఒకరు దిల్లీ మర్కజ్ వెళ్లి రావడంతో వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు.
ఏపీలో కరోనా పాజిటివ్ రేటు 1.57శాతమేనని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు. దేశంలో ఈ రేటు 4.13శాతంగా ఉందన్నారు. రాష్ట్రంలో 80 నుంచి 90శాతం కేసులు ఇప్పటికే ఉన్న క్లస్టర్లలోనే వస్తున్నాయి. తమిళనాడు, రాజస్థాన్ కంటే మనమే ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం ’ అని తెలిపారు.









