
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడిలోకి వచ్చింది. మొదట్లో కాస్త హడావిడి చేసినప్పటికీ కేసీఆర్ ముందుగానే కట్టడి చర్యలు చేయడం తో కరోనా తన ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత ఢిల్లీ ప్రార్థనల తర్వాత ఒక్కసారిగా కరోనా కేసులు రాష్ట్రంలో విపరీతం అయ్యాయి. దీంతో కేసీఆర్ ఎక్కడిక్కడే చర్యలు చేపట్టడం, లాక్ డౌన్ పటిష్ట్రం చేయడం తో కరోనా తన ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తం పది లోపే కేసులు నమోదు అవుతుండడం తో మే 07 తర్వాత తెలంగాణ కరోనా లేని రాష్ట్రంగా ఉండనుందని తెలుస్తుంది.
ఈ క్రమంలో రాష్ట్రంలో 11 కరోనా రహిత జిల్లాలను ప్రభుత్వం ప్రకటించింది. వనపర్తి, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సిద్ధిపేట, మహబూబ్ నగర్, మంచిర్యాల, నారాయణ పేట, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు, ములుగు జిల్లాల్లో కేసులు నమోదు కావడం లేదు. ఈ జిల్లాల్లో కరోనా సోకిన వారందరూ చికిత్స పొంది..పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.









