
కరోనా వైరస్ కారణంగా ప్రజలనంత సామాజిక దూరం పాటించాలని..రోడ్ల పైకి రాకూడదని..మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని అంత చెపుతుంటే చాలామంది ఇవేమి పాటించడం లేదు. కానీ కోతులు మాత్రం లాక్ డౌన్ ను ఖచ్చితంగా పాటిస్తూ మీ మునుషులకన్నా మీమే బెటర్ అని చెపున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్ లో ఓ వ్యక్తి కోతుల కోసం పండ్లు, పుచ్చకాయలు వంటివి తీసుకొని వెళ్ళాడు. కోతులు వేసేందుకు రోడ్డుపై ఉంచాడు. దీంతో అడవిలో నుంచి కొన్ని కోతులు రోడ్డు మీదకు వచ్చాయి. అన్ని కోతులు వరసగా దూరంగా సామాజిక దూరం పాటిస్తూ వచ్చాయి. ఒక కోతికి పండు ఇచ్చిన తరువాత మరొక కోతికి ఇస్తూ వచ్చాయి. అవన్నీ కూడా సామాజిక దూరం పాటిస్తూ ఉండటం విశేషం. ఈ ఫోటో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది.









