ఆ లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్ వచ్చింది..

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాల దేశాలు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. కరోనా లక్షణాలు ఉంటె వెంటనే వైద్యం చేయించుకోవాలని కోరుతున్నారు. అయితే, కొందరికి మాత్రం కరోనా లక్షణాలు లేకుండానే కరోనా బారిన పడుతున్నారు.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

అమెరికాలోని పలు జైళ్లలో ఉన్న 2700 మంది ఖైదీలకు కరోనా టెస్టులు నిర్వహించారు. ఇందులో 2028 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే, ఖైదీలలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించడం లేదని, టెస్టులు చేస్తే కరోనా పాజిటివ్ అని తేలినట్టు అధికారులు చెప్తున్నారు. కరోనా లక్షలుగా చెప్పుకునే జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు వంటివి లేకున్నా కొంతమంది కరోనా బారిన పడుతున్నారని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు.