కరోనాతో లోక్ పాల్ త్రిపాఠి కన్నుమూత

లోక్‌పాల్‌ సభ్యుడు,మాజే న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌కుమార్‌ త్రిపాఠి (62) కరోనాతో కన్నుమూశారు. ఏప్రిల్‌ 2 నుంచి ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్యం విషమించడంతో సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

లోక్‌పాల్‌ అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్‌కు చెందిన నలుగురు జ్యుడీషియల్‌ సభ్యుల్లో ఒకరైన జస్టిస్ త్రిపాఠి.. గతంలో ఛత్తీస్‌గఢ్‌ హైకోర్ట్‌ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన కుమార్తె, ఇంట్లో వంట మనిషికీ కరోనా సోకింది. వాళ్ళ పరిస్థితి స్టేబుల్ గానే వుంది.