ఏపీలో ఇక మద్యానికి నో ప్రాబ్లమ్

రాష్ట్రంలో మద్యం ఉత్పత్తికి ఏపీ సర్కార్‌ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన అనుమతులతో రేపట్నుంచే 20 డిస్టలరీలు తెరుచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మద్యం ఉత్పత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంపెనీలను పూర్తిగా శానిటైజ్‌ చేశాకే మద్యం తయారీ చేయాలనీ.. ఆ సమయంలో కార్మికులు భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని ఆదేశించింది.

Also Read :  రూ.2 లక్షలతో నీటి సదుపాయం… ప్రభుత్వ పాఠశాలలకు అండగా ‘కైండ్ ఇండియా’

కాగా లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వొద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. మద్యం విక్రయానికి రాష్ట్రాలకు అనుమతివ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. మద్యాన్ని ఆర్థిక వనరుగా పరిగణించడం అనైతికమన్నారు.