కేరళలో జీరో కేసులు

కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక్కకేసూ నమోదు కాలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ చెప్పారు రాష్ట్రంలో ప్రస్తుతం 95 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. మరో 401 మంది బాధితులు కరోనా బారినుంచి కోలుకున్నారని మంత్రి చెప్పారు. ప్రస్తుతం కేరళలో 84 హాట్‌స్పాట్లు ఉన్నాయని శైలజ తెలిపారు.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

ఇక భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు 40 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,487 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 83 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో నమోదైన కేసుల సంఖ్య 40,263కి చేరింది.