తెలంగాణలో పెరిగిన కేసులు


తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఆదివారం మరో 21 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ‍మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులిటిన్ విడుదల చేసింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 20, జగిత్యాలలో 1 కేసు నమోదవటంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1082కు చేరింది. ఇవాళ 46 మందితో కలిపి ఇప్పటి వరకు 545 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 29 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 508 మంది చికిత్స పొందుతున్నారు.