పాతబస్తీ లో భారీ గ్యాంగ్ వార్ ..

లాక్ డౌన్ వేళా హైదరాబాద్ పాత బస్తి లో రెండు వర్గాల మధ్య గ్యాంగ్ వార్ చోటు చేసుకోవడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. స్థానిక భవానీ నగర్‌లో కొంతమంది యువకులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలు, రాళ్లతో ఘర్షణకు దిగారు. బైక్ పార్కింగ్ విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఘటనలో అనుమానితులుగా భావిస్తున్న కొంతమంది యువకులను భవానీనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గొడవకు కారణమైన వారిపై కేసులు నమోదు చేశామని, ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.